క్రిమినల్ కేసులే.. ఆస్పత్రులకు వార్నింగ్

by srinivas |
క్రిమినల్ కేసులే.. ఆస్పత్రులకు వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా చికిత్స అందించకపోతే క్రిమినల్ కేసులు పెట్టడానికి వెనుకాడబోమని ప్రైవేట్ ఆస్పత్రులకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వార్నింగ్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి కరోనా చికిత్స ఉచితమేనని, మిగిలిన వారికి ప్రభుత్వం నిర్ణయించిన కరోనా చికిత్స ధరలు వర్తింపజేయాలన్నారు. కరోనా చికిత్సకు ఎక్కువ వసూలు చేస్తే ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. ఆనందయ్య మందుపై ఇంకా స్పష్టత రావాలని అనిల్‌ సింఘాల్‌ చెప్పారు.

ఇటీవలే వివిధ వైద్య వర్గాలు, ఆస్పత్రుల యాజమాన్యాలను సంప్రదించి కరోనా చికిత్సకు రేట్లు పెంచామన్నారు. ఈ లెక్క ప్రకారం కాకుండా పేషెంట్ల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందాయని, ఆ హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నపిల్లల్లో కరోనా సోకితే ఎలాంటి వసతులు కల్పించాలన్న దానిపై కమిటీ వేశామని , వారం రోజుల్లో నివేదిక ఇస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed