10/10 క్లబ్‌లోకి అజాజ్ పటేల్.. అనిల్ కుంబ్లే ఏమన్నాడంటే.?

by Shyam |   ( Updated:2021-12-04 23:47:35.0  )
10/10 క్లబ్‌లోకి అజాజ్ పటేల్.. అనిల్ కుంబ్లే ఏమన్నాడంటే.?
X

దిశ, వెబ్‌డెస్క్ : ముంబైలోని వాంఖడే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టెస్టు చరిత్రలో జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే మాత్రమే ఈ రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. తాజాగా పటేల్ కూడా వారి సరసన చేరాడు. ఈ క్రమంలో భారత టెస్టు దిగ్గజం అనిల్ కుంబ్లే స్పందించాడు.

ముంబై టెస్టులో తొలి రెండు రోజులు అద్భుతంగా బౌలింగ్ చేశావు.. ఇది ఎంతో ప్రత్యేకమైన ఘనత అంటూ ప్రశంసించాడు. అంతేకాకుండా ఇక నుంచి న్యూజిలాండ్ ఆడబోయే ప్రతీ మ్యాచ్‌లో అజాజ్ పటేల్ నుంచి 10 వికెట్ల ప్రదర్శన ఆశిస్తారని కుంబ్లే కామెంట్స్ చేశాడు.

RCB ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఏబీ డివిలియర్స్ మళ్లీ వస్తున్నాడు.!

Advertisement

Next Story