- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూపర్వైజర్ పోస్టుల భర్తీ పారదర్శకంగా జరగాలి..
దిశ, నర్సంపేట టౌన్ : సూపర్వైజర్ పోస్టులను పారదర్శకంగా నిర్వహించాలని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్‌ను వారి కార్యాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి నేతృత్వంలో కలిశారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్, మంత్రి సత్యవతి రాథోడ్ కార్యాలయంలో సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఐసీడీఎస్‌లో గ్రేడ్-2 సూపర్ వైజర్ నియామకాలకు హైదరాబాద్ జోన్ పరిధిలో గురువారం నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషనర్‌ను కలిసి వారు మాట్లాడుతూ.. 2018లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 1.1.2016 వరకు 50 ఏండ్ల వయసు, పదవ తరగతి ఉత్తీర్ణత, పది సంవత్సరాల అనుభవం ఉన్నవారిని అర్హులను చేస్తూ జీఓ నెంబర్ 57 ఇచ్చారన్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు నియామకాలు జరగలేదన్నారు. కాబట్టి జీఓ నెంబర్ 57 ప్రకారం నియామకాలు చేపట్టాలని, సర్వీసుకు గ్రేస్ మార్కులు ఇవ్వాలని కోరారు.
1975లో ICDS ప్రారంభమైనప్పుడు ఏడవ తరగతి ఉత్తీర్ణులైన వారిని కూడా అంగన్వాడీ టీచర్‌గా నియమించారని ఐసీడీఎస్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఓ పక్క పని చేయలేక, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక 60 సంవత్సరాల పైబడిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్‌కు ఐదు లక్షలు, ఆయాకు మూడు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, వేతనంలో సగం పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని కోరారు. 1 జులై 2021న అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు పీఆర్సీ పెంపులో భాగంగా అంగన్వాడీ టీచర్స్‌కు, ఆయాలకు వేతనంలో 30%పెంచుతూ ప్రభుత్వం జీ.ఓ- 47ఇచ్చారని, పెంచిన వేతనాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. అలాగే, పెండింగ్‌లో ఉన్న ఇంటి అద్దెల బిల్లులు సైతం చెల్లించాలన్నారు. కమిషనర్ స్పందిస్తూ 1.1.2016 వరకు 50 సంవత్సరాలు ఉన్నవారికి అవకాశం కల్పిస్తామని, జులై 1 నుండి పెంచిన వేతనాలను ఏరియర్స్ రూపంలో ఇస్తామని, త్వరలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.