జాతీయ జెండాకు అవమానం.. రివర్స్‌లో త్రివర్ణ పతాకం

by Shyam |
జాతీయ జెండాకు అవమానం.. రివర్స్‌లో త్రివర్ణ పతాకం
X

దిశ, మహబూబాబాద్: 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ దేశమంతా జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. కానీ పంద్రాగస్టున ఎగురవేసిన జాతీయ జెండాను గురువారం(ఆగస్టు 19) వరకు తొలిగించకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని తూర్పు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ధరవాత్ తండా అంగన్ వాడి సెంటర్‎లో ఈ ఘటన వెలుగుచూసింది. నాలుగురోజులవుతున్నా జాతీయ జెండా‌ను అవగతనం చేయకపోవడంతో గ్రామ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాటి నుంచి నేటి వరకు జాతీయ జెండా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చీకట్లో మగ్గుతుందని.. ఇంత నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మూడు రంగులతో(ఆరెంజ్, వైట్, గ్రీన్) రెపరెపలాడాల్సిన త్రివర్ణం.. రివర్స్‌లో(గ్రీన్, వైట్, ఆరెంజ్) ఉండడంతో స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed