యూఎస్ ఓపెన్‌లో ముర్రే కొట్టేశాడు

by Shyam |
యూఎస్ ఓపెన్‌లో ముర్రే కొట్టేశాడు
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ ముర్రే 20 నెలల తర్వాత రాకెట్ పట్టాడు. రెండు సర్జరీలు చేసుకున్న అనంతరం హార్డ్ కోర్టులోకి అడుగుపెట్టిన ముర్రే తన తొలి గేమ్‌ను గెలిచి యూఎస్ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. తాను ఆడిన గేమ్ సుదీర్ఘంగా 5 సెట్ల పాటు కొనసాగింది. చాలా కాలం తర్వాత కోర్టులోకి అడుగుపెట్టినా.. తన శక్తిని సాధ్యమైనంత మేర ఉపయోగించి గేమ్‌ను గెలుచుకున్నాడు. ప్రేక్షకులను ఎవరినీ స్టేడియంలోని అనుమతించలేదు. కానీ ముర్రే చాలా ఏండ్ల తర్వాత గేమ్ ఆడుతుండటంతో సహచర ఆటగాళ్లు గ్యాలరీల్లో కూర్చొని వీక్షించడం విశేషం.

2012లో యూఎస్ ఓపెన్ గెలిచిన తర్వాత ముర్రే ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. కానీ మంగళవారం రాత్రి ఆడిన గేమ్ అందరినీ ఆకట్టుకుంది. యోషితో నిషోకాతో జరిగిన మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు కోల్పోయిన ముర్రే.. ఆ తర్వాత ఒక్కసారిగా గేమ్‌ను మలుపు తిప్పాడు. 3, 4 సెట్లు సుదీర్ఘంగా సాగాయి. కానీ చివరి సెట్‌‌లో ఒక సారి సర్వీస్ బ్రేక్ చేసి మ్యాచ్ గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ అత్యంత సుదీర్ఘంగా 4 గంటల 39 నిమిషాల సేపు కొనసాగింది. చివరకు 4-6, 4-6, 7-6(5), 7-6(4), 6-4 తేడాతో ముర్రే విజయం సాధించాడు. ముర్రే తర్వాతి రౌండ్‌లో కెనడాకు చెందిన 15వ సీడ్ ఫ్లెక్స్ ఆగర్‌తో తలపడనున్నాడు.

Advertisement

Next Story

Most Viewed