టోక్యో ఒలింపిక్స్ జట్టులో ఆండీ ముర్రే

by Shyam |
టోక్యో ఒలింపిక్స్ జట్టులో ఆండీ ముర్రే
X

దిశ, స్పోర్ట్స్: రెండు సార్లు ఒలింపిక్ పతకం గెలిచిన బ్రిటిష్ టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ ముర్రే టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాడు. బ్రిటిష్ ఒలింపిక్ అసోసియేషన్ గురువారం టోక్యో ఒలింపిక్స్ టెన్నిస్ బెర్తులను ప్రకటించింది. ఆండ్రీ ముర్రే, డాన్ ఇవాన్స్ మెన్స్ సింగిల్స్ విభాగంలో అర్హత సాధించారు. దీంతో పాటు జో సాలిస్‌బరీతో కలసి ముర్రే మెన్స్ డబుల్స్‌లో కూడా పాల్గొననున్నాడు. ‘ఒలింపిక్స్ అంటే నాకు చాలా గొప్ప. నాలుగో సారి ఒలింపిక్స్‌లో పాల్గొనడం గర్వ కారణంగా ఉన్నది. బ్రిటన్ టెన్నిస్ టీమ్‌ను ముందుండి నడిపించడం ఆనందంగా ఉన్నది. నాలుగేళ్ల క్రితం రియో ఒలింపిక్స్ నా కెరీర్‌లో మరిచిపోలేనివి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లడం ఆనందంగా ఉన్నది. ఈ సవాలును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను’ అని ముర్రే ఒక ప్రకటనలో తెలిపాడు. 2012, 2016 ఒలింపిక్స్‌లో ఆండ్రీ ముర్రే విజేతగా నిలిచాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో రోజర్ ఫెదరర్‌ను ఫైనల్‌లో ఓడించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed