సేవల ధరల పెంపుపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-04 05:06:56.0  )
సేవల ధరల పెంపుపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: సేవల ధరలను పెంచే ఆలోచన టీటీడీకి లేదని, ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే జరిగిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. రెండేళ్ల తర్వాత సర్వదర్శనాన్ని ప్రారంభించామని, సర్వదర్శనం ప్రారంభించి 10 రోజులవుతుందన్నారు. సర్వదర్శనం ప్రారంభమైన తర్వాత భక్తుల రద్దీ పెరిగిందన్నారు. త్వరలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తుల కోసం చపాతీలు, రొట్టెలు అందిస్తామన్నారు. తిరుమలలోని మరో 2 ప్రాంతాల్లో అన్నప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆర్జిత సేవల పున:ప్రారంభానికి సమయం పడుతుందని, ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు.

Advertisement

Next Story