వైసీపీ లో కలహాలు కుంపట్లు..నియోజకవర్గ వర్గాల్లో వర్గపోరు

by Jakkula Mamatha |
వైసీపీ లో కలహాలు కుంపట్లు..నియోజకవర్గ వర్గాల్లో వర్గపోరు
X

దిశ, ప్రతినిధి: కడప జిల్లాలో అంతా తానై జగన్మోహన్ రెడ్డిని నడిపిస్తున్న, నియోజకవర్గ నేతల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నేతల మధ్య కలహాల కుంపట్లు కొనసాగుతూనే ఉన్నాయి.కాకపోతే పార్టీ అధినేత జిల్లాకు చెందిన వారు కావడంతో విభేదాల కుంపట్లు బహిర్గతం కాకుండా అంతర్గతంగా నలుగుతున్నాయి. ఈ పరిణామాలు ఎన్నికల వేల బయట పడితే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న అభిప్రాయాలు రాజకీయ పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. జగన్ సొంత పార్టీ లో విభేదాలను జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి మొదలుపెడితే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ల మధ్య సఖ్యత కనిపించడం లేదు. వారి వర్గాలు సర్దుబాటు ధోరణి తో పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. వీరిద్దరి మధ్య సర్దుబాటు కోసం ఇటీవల కడప జిల్లా అధ్యక్షుడి దగ్గర చర్చలు జరిగినా, విభేదాలు సర్ధుబాటు కాలేదని సమాచారం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది.ఇక్కడ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ రమేష్ యాదవులకు మధ్య సఖ్యత లేదు. ఇద్దరు కలిసి కార్యక్రమాలు కొనసాగించే పరిస్థితులు కనిపించడం లేదు.

వీరు ఎవరికి వారుగా ఉంటున్నారన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది. కమలాపురంలో బయటికి పోయిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ మల్లికార్జున రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి తిరుగుతున్నట్లు అనిపించినా ఎవరి వర్గాల వారితో వారే ఉంటున్నారు. బద్వేల్ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి ఆయన బంధువు విశ్వనాథరెడ్డి,ఏపీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి లు ఎవరికి వారుగా ఉంటున్నారు. బద్వేలు అసెంబ్లీ టికెట్టు ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ఇవ్వడం పట్ల ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి వ్యతిరేక వర్గమైన విశ్వనాథరెడ్డి వర్గీయులు వ్యతిరేకించారు. అయితే వీరి మధ్య అధిష్టానం ఇటీవల సఖ్యత చేకూర్చే ప్రయత్నాలు చేపట్టింది. రాజంపేట అసెంబ్లీలో ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి, జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు తోడు సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా కు కాకుండా నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అభ్యర్థి గా ఖరారు కానున్నారు .ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య సఖ్యత ఏ మేరకు ఉంటుందో, వచ్చేఎన్నికల్లో ఏ మాత్రం కలిసి పనిచేస్తారో సందేహంగా మారింది. కాకపోతే మేడ సోదరుడు రఘునాథ రెడ్డి కి రాజ్యసభ ఇవ్వడంతో మేడా వర్గీయుల అసంతృప్తికి కొంత ఉపశమనం కల్పించినట్లు అయిందని చెప్పుకోవచ్చు.

రైల్వే కోడూరు, రాయచోటి లో ఇలాంటి పరిస్థితులు పెద్దగా కనిపించలేదు కానీ మైదుకూరులో కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే రఘురామిరెడ్డి , డి సి సి బ్యాంక్ చైర్మన్ తిరుపాల్ రెడ్డి వర్గాల మధ్య సఖ్యత కనిపించడం లేదు.ఇలా ఉమ్మడి కడపలో పలు చోట్ల నేతల మధ్య విభేధాల కుంపట్లు రంగులుతూ ఉండడం,మరో వైపు ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చే స్థాయిలో కొందరు ఎమ్మెల్యేల పనితీరు,ప్రభుత్వ విధానాలు లేక పోవడం లాంటి కారణాలు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఆ పార్టీ పట్టు పై సందేహాలు ఏర్పడుతున్నాయి .మరి జగన్ మోహన్ రెడ్డి 2014 ,2019 ఎన్నికల నాటి ఫలితాలు రావాలంటే సొంత గడ్డ పై ఎలాంటి వ్యూహం అవలంభిస్తారన్నది ఆ పార్టీ వర్గాలతో పాటు,జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed