- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ రెడ్డి రాజకీయ లబ్ధికే "ఆడుదాం ఆంధ్రా"
దిశ,కడప: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చారని రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు విమర్శించారు.ఆంధ్ర రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలు మన క్రీడాకారులను కూడా వదలని పరిస్థితి కనపడుతుందన్నారు.ఆయన మంగళవారం రాయచోటి లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఆంధ్ర రాష్ట్ర రంజీ జట్టుకు కెప్టెన్ హనుమ విహారి కూడా ఈ ప్రభుత్వ అరాచకాలు భరించలేక రాజీనామా చేస్తున్నానని చెప్పారు. భవిష్యత్తులో కూడా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఆడనని చెప్పి బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటే,ఈ సైకో ప్రభుత్వం చివరికి క్రీడాకారులను కూడా వదలట్లేదు అనేదానికి ఒక నిదర్శనం విమర్శించారు.
వైకాపా ప్రభుత్వంలో క్రీడాకారులను ప్రోత్సహించిన పాపాన పోలేదన్నారు.సొంత టాలెంట్ పై ఎదిగిన క్రీడాకారులే, స్వార్థ రాజకీయాల కోసం వైకాపా నాయకుని కుమారుడి కోసం బంగారు భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్ర పరువు నిలబెట్టిన హనుమ విహారిని తొలగించడం నిజంగా ఇది చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నామన్నారు. జగన్ రెడ్డి పరిపాలనలో క్రీడా వ్యవస్థను నీరుగార్చారని,క్రీడాభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు.రాష్ట్ర యువతలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువైందని,రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడానికి "ఆడుదాం - ఆంధ్ర " పేరుతో జగన్ రెడ్డి సరికొత్త ప్రచార ఆర్భాటం చేశారన్నారు. ఈకార్యక్రమంలో వీరబల్లి మండల పార్టీ అధ్యక్షులు భాను గోపాల్ రాజు,సర్పంచ్ నాగార్జున ఆచారి,నాగభూషణం నాయుడు,రాజా నాయుడు,బాలకృష్ణ,దుర్గం ఆంజనేయులు,బాలయ్య తదితరులు పాల్గొన్నారు.