- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
kadapa: దమ్ముంటే రా తేల్చుకుందాం.. !
దిశ, రాజంపేట: దమ్ముంటే రా తేల్చుకుందామంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట తెలుగుదేశం ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు సవాల్ విసిరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గంట సేపు సైబర్ క్రైమ్ గురించి మాట్లాడారని, ఓటర్ వెరిఫికేషన్‌ను భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని కలిపి మాట్లాడడం సజ్జల తెలివి తక్కువ తనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. టీడీపీ మినీ మేనిఫెస్టో, భవిష్యత్తుకు బాబు గ్యారెంటీ అనే పథకం కింద ఇంటింటికి షూరిటీ బాండ్లనివ్వడం నేరమా అని చంగల్ రాయుడు ప్రశ్నించారు.
నోరు పారేసుకుంటే ఊరుకోం..!
ఇకపై ఎవరైనా నోరుపారేసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని, దమ్ముంటే డేటు, టైం, ప్లేస్ ఫిక్స్ చేస్తే తేల్చుకుందామంటూ చంగల్ రాయుడు సవాల్ విసిరారు. అన్ని క్రైమ్‌లు వైసీపీ వారే చేస్తూ, ఇతరులపై కంప్లైంట్ చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే గుణపాఠం చెబుతారని చంగల్ రాయుడు హెచ్చరించారు.