- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kadapa: కరడు కట్టిన స్మగ్లర్‌పై పీడీ యాక్ట్
దిశ, కడప: కరడు కట్టిన అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్, ఘరానా దొంగ షేక్ సింపతి లాల్ బాషాపై కడప పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. కడప జిల్లా ఖాజీపేట మండలం ఖాదర్‌పల్లికి చెందిన బాషా పదేళ్లుగా ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్నారు. 2013 నుంచి ఇప్పటివరకు ఆయనపై 71 ఎర్రచందనం కేసులు నమోదయ్యాయి. మరో 14 దొంగతనం కేసులు కూడా నమోదయ్యాయి.
నిందితుడు బాషాకు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలున్నాయి. తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి రైల్వే కోడూరు, బాలుపల్లి, సానిపాయ, అట్లూరు, చెన్నూరు బద్వేల్, గువ్వలచెరువు ఘాట్ అడవులతో పాటు సుండుపల్లి అటవీ ప్రాంతంలోనూ ఎర్రచందనాన్ని నరికిస్తారు. ఆ తర్వాత వాటిని దుంగలుగా చేసి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తుంటారు. ఈ మేరకు బాషాపై పి.డి చట్టం నమోదు చేశామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పత్రాలను సెంట్రల్ జైలు అధికారులకు అందజేమని చెప్పారు. ఎర్ర చందనం అక్రమ రవాణా, అందుకు సహకరించిన వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ తెలిపారు.