- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రోజు అష్టదిగ్బంధంలో కడప..కర్ఫ్యూ ను తలపించేలా నిబంధనలు
దిశ ప్రతినిధి, కడప: ఎన్నికల కమిషన్ సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఆరోపణలకు, ఉద్రిక్తతలకు తావు లేకుండా ఉండేందుకు కడప పోలీసులు, ఎన్నికల అధికారులు అలర్ట్ అయ్యారు. కౌంటింగ్ రోజు పట్టణంలో గాని, కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో కానీ గుంపులుగా ఉండడం, వివాదాలకు తావు ఇవ్వడం లాంటివి చేస్తే కఠినంగా వ్యవహరించనున్నారు. కౌంటింగ్ రోజు కడప నగరానికి వచ్చే ఏ బస్సులు కూడా పట్టణంలోకి రాకుండా పట్టణ శివారులకే పరిమితం చేసింది. కడప నగరంలో లాడ్జిలలో కొత్తవారు ఉండకూడదని మూడో తేదీ మధ్యాహ్నమే కడప వదిలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. కౌంటింగ్ రోజు శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే అనుమానం ఉన్న వారిని ఉండకూడదని సూచించారు. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ముళ్ళకంచె వేసి భద్రతలను కట్టుదిట్టం చేశారు.
నగరంలోకి బస్సులు రావడం పూర్తిగా రద్దు చేయడం,144 సెక్షన్ విధించడంతో పాటు శాంతిభద్రతల దృష్ట్యా కడపను అష్టదిగ్బంధనం చేయనున్నారు. కడప నగరంలోని లాడ్జిలు, హోటల్ లో పోలీసుల అనుమతి లేకుండా ఎవరూ గదిలో ఉండకూడదని సూచించారు. కడప నగరంలో ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజు చోటు చేసుకున్న గౌస్ నగర్ ఘటన నేపథ్యంలో ఇద్దరు ప్రధాన నాయకులతో పాటు 40 మంది పై బైండోవర్ కేసులు పెట్టారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడినా, గొడవలకు దిగిన, పరిస్థితి సీరియస్ గా ఉంటుంది హెచ్చరించారు. రాష్ట్ర పోలీస్ బాస్ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు బ్రాందీ షాపులను మూసివేసిన అన్ని రకాల చర్యలు చేపట్టడం ద్వారా కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే కడప నగరం ఆ రోజు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించనుంది.