- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kadapa: జువారి సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
దిశ, కడప: వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలంలోని అతిపెద్ద సిమెంట్ పరిశ్రమ జువారి సిమెంట్ ఫ్యాక్టరీలో ట్రాన్స్ ఫార్మర్ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమ సబ్ స్టేషన్‌లో విద్యుత్ అప్ అండ్ డౌన్ వస్తూ ఉండడంతో మరమ్మత్తుల కొరకు టెక్నికల్ ఇంజనీర్ అక్కడికి చేరాడు. ట్రాన్స్ ఫార్మర్ పేలుతున్న విషయాన్ని గమనించి తప్పించుకున్నాడు. వెంటనే ట్రాన్స్ ఫార్మర్ పేలి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పరిశ్రమకు చెందిన ఫైర్ ఇంజన్‌తో పాటు ప్రొద్దుటూరు కమలాపురానికి చెందిన అగ్నిమాపక శకటాలు పరిశ్రమకు చేరుకుని మంటలను అదుపు చేశాయి.
అయితే ట్రాన్స్‌ఫార్మర్‌పై పరిశ్రమ మొత్తం ఆధారపడి ఉండడంతో దాదాపు 5 వేల టన్నుల సిమెంటు తయారీ నిలబడిపోయినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరమ్మతులకు దాదాపు రెండు మూడు రోజులు పట్టవచ్చని సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పారిశ్రమ యాజమాన్యం వర్గాలు తెలిపాయి