- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులపై కాల్పులను ఖండిస్తూ.. ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన
దిశ ప్రతినిధి, కడప: ఢిల్లీ సరిహద్దుల్లో మద్దతు ధర చట్టం చేయమని, రెండేళ్ల క్రితం రైతులకు క్షమాపణలు చెబుతూ మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. పోరాటం లో చనిపోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. రెండవ దఫా రైతాంగం మొదలుపెట్టిన ఉద్యమం పై హర్యానా బీజేపీ ప్రభుత్వం పోలీసులతో కాల్పులు జరిపించడం వల్ల 23 ఏళ్ల యువరైతు మృతి చెందిన ఘటనపై బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ శుక్రవారం ఏఐటీయూసీ, సీఐటీయు కడప నగర కమిటీ ల ఆధ్వర్యంలో సెవెన్ రోడ్స్ దగ్గర వున్న కడప ఆర్డీవో ఆఫీస్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. నాగసుబ్బారెడ్డి, సీఐటీయు జిల్లా కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో రైతుల భూములను, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పుతూ మోడీ తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త రైతాంగం చేసిన 15 నెలల పోరాటాల సందర్భంగా మోదీ ప్రభుత్వం దేశ రైతాంగానికి క్షమాపణలు చెబుతూ ఇచ్చిన హామీలు మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయలేదని అన్నారు.
కాబట్టి రైతాంగం రెండవ దఫా పోరాటాలకు దిగాల్సిన పరిస్థితులకు మోడీ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. గత పది ఏళ్ల కాలంలో మోడీ విధానాల ఫలితంగా 1,60,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేసి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. హర్యానా బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతాంగం పైకి పోలీసులను ప్రయోగించి అంతర్జాతీయ సమాజం నిషేధించిన పెళ్లెట్స్ వంటి ఆయుధాలను, బాష్ప వాయు గోళాలను రైతులపై విసరబట్టే 200 మంది రైతులు గాయపడి, అనేక.మంది చూపు కోల్పోయారని, ముగ్గురు రైతులు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
శుభ్ కరణ్ సింగ్ అనే 23 ఏళ్ల యువరైతు ప్రాణాలు వదిలాడని, ఇవి సాధారణ మరణాలు కావని, మోడీ ప్రభుత్వ హత్యలని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ సెక్రటరీ బాదుల్లా, సిఐటియు జిల్లా అధ్యక్షుడు కామనూరు శ్రీనివాసులు రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.