Kadapa: లక్కిరెడ్డిపల్లె ప్రాంత రైతులకు గుడ్ న్యూస్

by srinivas |   ( Updated:2023-09-04 13:25:55.0  )
Kadapa: లక్కిరెడ్డిపల్లె ప్రాంత రైతులకు గుడ్ న్యూస్
X

దిశ, కడప: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సాగునీరును కలెక్టర్ గిరీష పిఎస్ విడుదల చేశారు. లక్కిరెడ్డిపల్లి మండలం కాలాదివాండ్లపల్లె వద్ద వెలిగల్లు ప్రాజెక్టు కుడి కాలువ నుంచి ఆఫ్ టెక్ వాల్ ద్వారా సాగు, తాగునీరు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్కిరెడ్డిపల్లె ప్రాంత రైతులు, ప్రజల కోరిక మేరకు వెలిగల్లు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడం జరిగిందన్నారు. మూడు నెలల పాటు వెలిగల్లు ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ వరకు నీరు రావడం జరుగుతుందన్నారు. రైతులందరూ నీరు వృధా చేయకుండా సద్వినియోగం చేకోవాలని సూచించారు. లక్కిరెడ్డిపల్లి ప్రాంతంలో ఎక్కువగా వరి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, టమోటా వంటి పంటలు పండించడం జరిగిందన్నారు. ఈ ప్రాంత రైతుల కొరకు వెలిగల్లు కుడికాలువ నుంచి బొంతిరాళ్లకుంట, దిన్నేపాడు, కోమిటి వాండ్లచెరువులకు సంబంధించి ఒక టిఎంసి నీరు వదిలినట్లు చెప్పారు ఈ ప్రాంతంలోని రైతులందరూ వివిధ పంటలు సాగు చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు.

ప్రభుత్వ విప్, శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. నేడు రైతుల కోరిక మేరకు వెలిగల్లు ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేశామన్నారు. రైతులందరూ సాగునీరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇది రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తామని శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement

Next Story