Viveka Case: సీబీఐకు అవినాశ్ లేఖ.. ఇంకా రాని రిప్లై.. టెన్షన్.. టెన్షన్

by srinivas |   ( Updated:2023-05-21 16:27:08.0  )
Viveka Case: సీబీఐకు అవినాశ్ లేఖ.. ఇంకా రాని రిప్లై.. టెన్షన్.. టెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణపై ఉత్కంఠ నెలకొంది. వివేకానందారెడ్డి హత్య కేసులో ఈ నెల 22న తమ ఎదుట హాజరుకావాలని అవినాశ్ రెడ్డికి ఇప్పటికే సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇందుకోసం హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. అయితే ఎంపీ అవినాశ్ రెడ్డి మాత్రం ప్రస్తుతం హాజరుకాలేనని సీబీఐ అధికారులకు లేఖ రాశారు. తన తల్లి ఆనారోగ్యం దృష్ట్యా సోమవారం జరిగే విచారణకు రాలేనని పేర్కొన్నారు. తన తల్లి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాకే విచారణకు వస్తానని తెలిపారు. ఈ మేరకు అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాదులు సోమవారం హైదరాబాద్ వెళ్లి లేఖను అందజేయనున్నారు. అయితే ఇప్పటికే రెండుసార్లు విచారణకు అవినాశ్ రెడ్డి హాజరుకాలేదు. మరి సీబీఐ అధికారుల నిర్ణయం ఎలా ఉండబోతోందనేది చూడాలి..

Advertisement

Next Story

Most Viewed