- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ జెఏసి నిర్ణయం సరైనది కాదు-యుటీఎఫ్ నేతలు
దిశ,కడప: లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షల కనుగుణంగా నిలబడి పోరాటం చేయాల్సిన ఏపీ జెఏసి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత సాధించకుండానే ఫిబ్రవరి 27వ తేదీన 'ఛలో విజయవాడ' పిలుపును వాయిదా వేయడం సరైనది కాదు. ఏపీ జేఏసి నిర్ణయాన్ని యుటిఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని యుటియఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయ్ కుమార్, పాలెం మహేష్ బాబు పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఛలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అడ్డగిస్తారని మూడు రోజుల ముందే విజయవాడ చేరుతున్నట్లు తెలిపారు. అయితే ఏపీ జేఏసీ ఏకపక్షంగా ఛలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలను నీరుగార్చే విధంగా ఉందని వారు పేర్కొన్నారు. పిఎఫ్, ఏపిజిఎల్ఐ తదితర ఆర్థిక బకాయిలు 20వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏ విధమైన స్పష్టత ఇవ్వకుండా మినిట్స్ జారీ చేశారన్నారు. 11వ పిఆర్సీ బకాయిల చెల్లింపు పై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు.
ఇంటీరియమ్ రిలీఫ్ ఇవ్వకుండా పిఆర్సీ అమలు చేస్తామని చెప్పడం బూటకమని వారు విమర్శించారు.సెప్టెంబర్ 2004 కంటే ముందు ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి అయిన వారికి కేంద్ర ప్రభుత్వ జారీ చేసిన మెమో ప్రకారం పాత పెన్షన్ అమలు చేయకుండా దాటవేస్తున్నారని ఆరోపించారు.10 వేలమంది కాంట్రాక్ట్ సిబ్బంది లని రెగ్యులర్ చేస్తామని చెప్పిన మాట నీటి మూట గా మారి పోయిందని విమర్శించారు. ఇలా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను, ఉపాధ్యాయ సంఘాలను తప్పుదోవ పటిస్తున్నందున ఉద్యమం చేయాల్సిన సమయంలో ఇలా అర్ధాంతరంగా ఉద్యమాన్ని ఏపీ జేఏసీ వాయిదా వేయడాన్ని యుటియఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని వారు తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటాన్ని కొనసాగించాలని వారు కోరారు. జేఏసీ పోరాటం కొనసాగించని పక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన యుటిఎఫ్ ఒంటరిగానైనా పోరాడుతుందని తెలిపారు.