- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mega Peoples Survey: 1.1 కోట్ల మిస్డ్ కాల్స్.. సీఎం జగన్ హర్షం
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మా నమ్మకం నువ్వే జగన్’ మెగా పీపుల్స్ సర్వే విజయంతంగా ముగిసింది. ఈ సర్వే శనివారం నాటితో ముగియడంతో సీఎం జగన్ ట్విటర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలను కలిసి సీఎం జగన్ పాలనపై వారి అభిప్రాయాలను వైసీపీ సేకరించింది. సీఎం జగన్ పాలనకు 1.1 కోట్ల కుటుంబాలు మిస్డ్ కాల్ ద్వారా మద్దతు ప్రకటించారు. ఈ మెగా సర్వే పూర్తి వివరాలను పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రజల మద్దతుకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. ‘మన పాలన పట్ల, మన ప్రభుత్వ విధానాల పట్ల అచంచలమైన నమ్మకాన్ని ఉంచి... ఫోన్లు చేసి తనకు మద్దతు తెలిపిన 1.16 కోట్ల కుటుంబాలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైసీపీ క్యాడర్‌కు ధన్యవాదాలు. మీకు మరింత సేవ చేసేందుకు... దేవుని దయ, మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.