AP Politics:‘అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా మంటలు’.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

by Jakkula Mamatha |
AP Politics:‘అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా మంటలు’.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్డీయే కూటమి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ పట్టుబడుతుందని తాను భావించానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. కానీ ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అలాగ జరగలేదని అన్నారు. అయితే ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా డిమాండ్ గట్టిగా వినిపించింది. బిహార్‌కు ప్రత్యేక హోదా కావాలని ఆర్‌జేడీ, ఎల్‌జీపీ, ఒడిశాకు ఇవ్వాలని బీజేడీ, ఏపీకి హోదా అంశాన్ని వైసీపీ ప్రస్తావించాయి. కానీ, వైసీపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడుగుతున్నా.. ఎన్డీయే మిత్రపక్షం టీడీపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ సెషన్‌లో టీడీపీ వైఖరిని పార్లమెంట్‌లో ఎండగడతామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed