Viveka Case: న్యాయ సహాయం కల్పించండి.. సుప్రీంకోర్టును అభ్యర్థించిన దస్తగిరి

by srinivas |   ( Updated:2023-07-02 12:24:29.0  )
Viveka Case: న్యాయ సహాయం కల్పించండి.. సుప్రీంకోర్టును అభ్యర్థించిన దస్తగిరి
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు న్యాయ వాదిని నియమించుకునేందుకు ఆర్థిక స్థోమత లేదని, న్యాయ సహాయం అందించాలని ధర్మసనాన్ని అభ్యర్థించారు.

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. అయితే వివేకా హత్యపై మొదట ఫిర్యాదు చేసింది తానే కాబట్టి తనను బాధితుడిగా చూడాలని కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు దస్తగిరికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన ఆర్థిక స్థోమత అంతంతమాత్రంగానే ఉందని.. తనకు న్యాయ సహాయం చేయాలని కోరారు. మరి దస్తగిరి విజ్ఞప్తిపై కోర్టు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed