- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది.. YS షర్మిల సంచలన ట్వీట్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం(NDA Govt)పై కాంగ్రెస్ పార్టీ(AP Congress) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. ‘ఓవైపు ప్రైవేటీకరణ ప్రశ్నే లేదంటారు. మరోవైపు అమ్మే నిర్ణయంలో మార్పు లేదంటూ లిఖిత పూర్వక సమాధానం ఇస్తారు’ అని కేంద్రంపై షర్మిల అసహనం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వానిది రెండు నాలుకల ధోరణి అని అన్నారు. పైకి ఆంధ్రుల హక్కు అంటూనే.. లోపల ప్లాంట్ అమ్మే కుట్రకు మోడీ తెరలేపారని ఆరోపించారు. అభివృద్ధికి రూ.11 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చామని ఒకవైపు గొప్పులు చెబుతూ.. లోలోపల ప్లాంట్ ప్రాణం తీస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్‌పై మోడీ ఫార్ములా "సైలెంట్ కిల్లింగ్" అని అన్నారు.
కూటమి ప్రభుత్వానిది పచ్చి మోసం. ప్లాంట్‌ను ఉద్ధరించామని చెప్పినవన్నీ ఉత్త మాటలే. అంతా మోసపూరితం. అసత్యపు వాగ్దానాలు. విశాఖ ఉక్కుపై ప్రైవేటీకరణ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది. అదానీకి అప్పనంగా అప్పగించేందుకు మోడీ ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని చంపడలో మోడీ(PM Modi) కర్త, చంద్రబాబు(CM Chandrababu) కర్మ, పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) క్రియ అని విమర్శించారు. ఈ ముగ్గురిని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం. అసలు విశాఖ స్టీంట్ ప్లాంట్‌పై వారి విధానం ఏంటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ(Visakha Steel Plant Privatization)పై ఇప్పటికైనా మోడీ కుటిల ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. వెంటనే స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయడం లేదని అధికారిక ప్రకటన చేయాలని. ఉద్యోగులను, కాంట్రాక్టు కార్మికులను కుదిస్తూ తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
ఓవైపు ప్రైవేటీకరణ ప్రశ్నే లేదంటారు. మరోవైపు అమ్మే నిర్ణయంలో మార్పు లేదంటూ లిఖిత పూర్వక సమాధానం ఇస్తారు. విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వానిది రెండు నాలుకల ధోరణి. పైకి ఆంధ్రుల హక్కుకు గౌరవం ఉందంటూనే లోపల ప్లాంట్ అమ్మే కుట్రకు మోడీ @narendramodi గారు ఆజ్యం పోస్తూనే ఉన్నారు. రూ.11 వేల… pic.twitter.com/1lRrdYeRcm
— YS Sharmila (@realyssharmila) March 19, 2025