- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Politics:వైసీపీ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పది రోజులే ఉండటంతో పార్టీల నేతలు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. రాష్ట్రంలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. అటు వైసీపీ ఇటు కూటమి మరోవైపు కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు, నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ క్రమంలోనే వైఎస్ జగన్‌పై వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో పర్యటించారు. షర్మిల ప్రచారంలో భాగంగా ప్రజలతో మాట్లాడుతూ..పింఛన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు.
వైసీపీ ప్రతి నెలా కొంత మందిని చంపాలని టార్గెట్ పెట్టుకుందని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులను వైసీపీ వంచించింది అని మండిపడ్డారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారి సమస్యలు తీరుస్తాం అని హామీ ఇచ్చారు. వారికి రూ.22 వేల కోట్లు బకాయిపడింది అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ ఆదుకుంటుంది. వారు బానిసలుగా పని చేయాల్సిన అవసరం లేదు అని ఆమె పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని షర్మిల కోరారు.