ఢిల్లీలో ధర్నాకు దిగిన వైఎస్ షర్మిల.. కారణం ఇదే..?

by Indraja |
ఢిల్లీలో ధర్నాకు దిగిన వైఎస్ షర్మిల.. కారణం ఇదే..?
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఈ రోజు ఢిల్లీ లో ఆందోళన చేపట్టారు. మద్దతుదారులతో కలిసి ఢిల్లీ లోని ఏపీ భవన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు . మాకు న్యాయం కావలి (ఉయ్ వాంట్ జస్టీస్), డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ సీఎం జగన్ అనే నినాదాలు ఆ ప్రాంతమంతా మారుమోగాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వైఎస్ షర్మిల జోష్ పెంచిన విషయం అందరికి తెలిసిందే . జిల్లాలవారీగా పర్యటిస్తూ ప్రజాక్షేత్రంలో పార్టీని ముందకు తీసుకువెళ్తోన్న షర్మిల రానున్న ఎన్నికల్లో అన్నను గద్దె దింపి తాను అధికారం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఇప్పటి వరకు జిల్లాల వారీగా పర్యటించిన షర్మిల నేడు రాష్ట్ర రాజధాని కోసం దేశ రాజధాని నగరంలో ఆందోళన చెప్పట్టారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తాను చేస్తున్న సమ్మెకు మద్దతు కోరుతూ ఈ రోజు ఉదయం పలు పార్టీల ఎంపీలకు వినతి పత్రాలు అందించారు షర్మిల. అలానే పలువురు ఎంపీలతో భేటీ అయ్యి ప్రత్యేక హోదా అంశం పై చర్చించారు.

ఇక ఆంద్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాల్సిందిగా కేంద్రాన్ని నిలదియ్యాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. ఇక ఎంపీల మద్దతును కూడగట్టుకున్న షర్మిల ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ లోని ఏపీ భవన్ ముందు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ ధారణ చేపట్టారు.

Advertisement

Next Story