- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన షర్మిల.. కాంగ్రెస్‌లో చేరిన నంద్యాల జెడ్పీటీసీ
దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల బిగ్ షాక్ ఇచ్చారు. నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు సైతం వైఎస్ షర్మిల సమక్షంలో హస్తం జెండా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గోకుల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తాను ఎంతో కష్టపడి చేశానని చెప్పారు. అయినా సీఎం జగన్ తనకు గుర్తింపు ఇవ్వాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశానని చెప్పారు. కానీ ఆ మర్యాద కూడా ఇవ్వలేదని వాపోయారు. తనపై వైసీపీ విచక్షణా రహితంగా ప్రవర్తించిందని, అందువల్లే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. కాంగ్రెస్ లో చేరడం అంటే తన సొంత ఇంటికి వచ్చినట్లుందన్నారు. వైఎస్ షర్మిల సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడి పని చేస్తానని గోకుల్ కృష్ణా రెడ్డి పేర్కొన్నారు.