- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS Sharmila: పల్నాడులో యువకుడి హత్యపై తీవ్రస్థాయిలో మండిపడ్డ వైఎస్ షర్మిల
దిశ, వెబ్ డెస్క్: బుధవారం రాత్రి పల్నాడులోని వినుకొండలో నడిరోడ్డుపై జరిగిన హత్యపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నడిరోడ్డుపై యువకుడిని విచక్షణా రహితంగా హత్య చేయడం వ్యక్తిగత కక్షల కారణంగా అయితే కఠినంగా శిక్షించాలని అన్నారు. అలాగే ఈ హత్య ఒకవేళ రాజకీయ కారణాలతో జరిగిఉంటే.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమే హత్యకు భాద్యత వహించాలని.. ఇదే.. కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక అని అన్నారు. గత నెలరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ఉదాంతాలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అడ్డుకట్ట వేస్తారా.. లేదా అని ప్రశ్నించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టం అవుతుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకొదని వైఎస్ షర్మిల తన ట్విట్ లో రాసుకొచ్చారు. కాగా బుధవారం రాత్రి రషీద్ అనే యువకుడిని పాత కక్షలతో జిలాని అనే మరో యువకుడు బస్టాండ్ సమీపంలోని రోడ్డుపై తనతో తెచ్చుకున్న కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతిపక్షాలు కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.