Breaking: పార్లమెంట్ సమావేశాల వేళ ఎంపీలతో జగన్ కీలక సమావేశం

by srinivas |   ( Updated:2024-07-20 08:25:16.0  )
Breaking:  పార్లమెంట్ సమావేశాల వేళ ఎంపీలతో జగన్ కీలక సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. వైఎస్ జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రాజ్యసభ, లోక్ సభకు చెందిన 15 మంది ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన అంశాలపై ఎంపీలకు అధినేత జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు డిమాండ్ చేయాలని ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ప్రధాని మోడీకి జగన్ లేఖ రాశారు. ఇక వినుగొండలో రషీద్ హత్యపై ఢిల్లీలో నిరసన చేస్తామని జగన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది.

Advertisement

Next Story