- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీది విధ్వంసకర పాలన..జోక్యం చేసుకోండి : రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన, అసాధారణ పరిస్థితులు ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రాబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చివేత, రాజధాని విధ్వంసం, న్యాయ మూర్తులు, కోర్టులపై సోషల్ మీడియా ద్వారా దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. ఎస్ఇసి, ఎపీపీఎస్సీ చైర్మన్ లపై వేధింపులు, దేవాలయాలపై దాడులు, శాంతి భద్రతలు, గంజాయి అమ్మకాలు, దొంగ ఓట్ల రాజకీయాలు, మహిళలు, దళిత గిరిజన మైనారిటీ బలహీన వర్గాలపై దాడులు, అక్రమ కేసులు, మీడియాపై దాడులకు వైసీపీ పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న విపరీత పరిస్థితులను కట్టడిచేసేందుకు చొరవ చూపాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి, ప్రధానిలకు ఆదివారం లేఖ రాశారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటనల వివరాలను తెలియజేస్తూ తొమ్మిది పేజీల లేఖలు రాశారు. ఈ లేఖలతోపాటు ఘటనలకు సంబంధించి 75 పేజీల అనుంబంధ డాక్యుమెంట్‌ను సైతం చంద్రబాబు జత చేశారు.
రాష్ట్రంలో విధ్వంస పాలన
2019లో వైఎస్ జగన్ సీఎం అయిన తరవాత రాష్ట్రంలో జరుగుతున్న హింస, నిరంకుశ పాలన, అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థల విధ్వంసం, న్యాయ వ్యవస్థ,కేంద్ర సంస్థలపై దాడులు వివరిస్తూ చంద్రబాబు రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను లేఖలో వివరించారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశాయని లేఖలో చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. తాజాగా చిత్తూరు జిల్లాలో తనపైనే హత్యాయత్నం చేసి తిరిగి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టడాన్ని లేఖలో చంద్రబాబు సవివరంగా తెలిపారు. 2019 ఆగస్టు నుంచి మొన్నటి అంగల్లు ఘటన వరకు తనపై జరిగిన దాడులు, నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం అనుసరించిన విధానాలను లేఖలో వివరించారు. ప్రణాళిక ప్రకారం, ప్రభుత్వం ప్రోత్సాహంతో తనపై జరుగుతున్న దాడుల విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్రపతిని, ప్రధానిని చంద్రబాబు లేఖలో కోరారు. రాష్ట్రంలో ఉన్న విపరీతపరిస్థితుల కారణంగా తనకున్న విశేషాధికారాలతో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నత స్థాయి మాల్-గవర్నెన్స్‌పై మీ దృష్టిని తేలవాలని ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. లెజిస్లేచర్, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలను భయపెడుతున్నారన్నారు. 2019 మేలో అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ తన 'విధ్వంసక పాలన'ను ఆవిష్కరించారని లేఖలో ఆరోపించారు. ప్రజా ఆస్తి అయిన 'ప్రజా వేదిక'ని కూల్చివేసి తన అసంబద్ధమైన మనస్తత్వాన్ని తెలియజేశాడు అని ఆరోపించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీచేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని వినాశకర నిర్ణయాలతో నాశనం చేశాడు అని చంద్రబాబు లేఖలో ఆరోపించారు.
ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్నాడు
వైఎస్ఆర్సీపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్‌ను, రాష్ట్రానికి డిప్యూటేషన్‌లో కొనసాగుతున్న అనేక మంది కేంద్ర అధికారులను తీవ్రంగా వేటాడింది అని ప్రధాని, రాష్ట్రపతికి రాసిన లేఖలో చంద్రబాబు వెల్లడించారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి నిరక్షరాస్యులను సైతం పట్టభద్రులుగా నమోదు చేసుకున్న తీరు ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి ఏ స్థాయిలో వక్రీకరిస్తారనడానికి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ఓటర్ల నమోదులో నిమగ్నమైన ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఎన్నికల ప్రక్రియను తారుమారు చేస్తూనే ఉన్నాడు. ఈ తప్పుడు పనులు చేయడానికి 'వలంటీర్లను' సైతం వాడుకున్నారు అని ఆరోపించారు. గ్రామం/వార్డు వలంటీర్ల ద్వారా పౌరుల హక్కులు, గోప్యతకు భంగం కలిగించే విధంగా రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి వ్యక్తిగత డేటాను సేకరించారు అని చంద్రబాబు లేఖలో ఆరోపించారు. ఎన్నికల సమయంలో బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ కోసం, తన పార్టీకి ఓటు వేయమని బలవంతం చేయడం కోసం వ్యక్తిగత డేటాను ఉపయోగించుకునే అవకాశం ఉందని చంద్రబాబు ఆరోపించారు.