Ycp Twitter అకౌంట్‌ హ్యాక్‌... ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు

by srinivas |
Ycp Twitter అకౌంట్‌ హ్యాక్‌... ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ కార్యాలయాల ట్విటర్ అకౌంట్లు, జీ మెయిల్‌లను హ్యాక్ చేసి డేటాను చోరీ చేసే హ్యాకర్లు ఇప్పుడు పొలిటికల్ పార్టీలపై పడ్డారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్ష పార్టీల ట్విటర్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు.

ఇటీవలే టీడీపీ ట్విటర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విటర్‌ అకౌంట్‌పై పడ్డారు. శుక్రవారం అర్థరాత్రి వైఎస్ఆర్ ట్విటర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రొఫైల్ పిక్, కవర్ పిక్‌లను మార్చేశారు. అంతేకాదు ట్విటర్‌ పేజీలో క్రిప్టో పోస్టులు కూడా అప్‌లోడ్ చేశారు.. పలు ట్వీట్లను రీట్వీట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు హ్యాకర్లు. ఈ విషయాన్ని గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్నికల్ సిబ్బంది ట్విటర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ ఐటీ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇకపోతే ఈ ఏడాది అక్టోబర్‌ ఒకటిన టీడీపీ అఫీషియల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌‌కు గురయింది. టైలర్‌ హాబ్స్‌ పేరుతో హ్యాకర్లు మార్చారు. అలాగే ఆ ఖాతాలో టీడీపీ పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్‌కు చెందిన పోస్టులు అప్‌లోడ్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన టీడీపీ డిటిజ‌ల్ వింగ్ నాడు ట్విటర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ట్విటర్ హ్యాక్‌‌కు సంబంధించి వైసీపీపై టీడీపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వైసీపీ మ‌ద్దతుదారులు ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశార‌ని టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed