వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు.. ఆ ముగ్గురు ఎవరంటే?

by Indraja |
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు.. ఆ ముగ్గురు ఎవరంటే?
X

దిశ వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రం లో విజయభేరిని మోగించి పార్టీ జెండాను రేపేరెపలాడించాలని ప్రతి పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వేలు ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు స్థాన బదిలీకాగా.. మరి కొంతమంది సిట్టింగులకు సీట్లు దక్కలేదు. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల వేళ అభ్యర్థుల విషయం లో మార్పులు చేర్పులు చేస్తూనే.. మరోవైపు రాజ్యసభ స్థానాల పైన కూడా ద్రుష్టి సారించిన సీఎం జగన్ మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా సీ.ఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఉన్నారు. కాగా వీరి పదవీ కాలం త్వరలో ముగియనుంది. దీనితో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, జంగాలపల్లి శ్రీనివాసులను అభ్యర్థులుగా ఖరారు చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. గొల్ల బాబూరావు ఎస్సీ కాగా జంగాలపల్లి శ్రీనివాస్ బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు. ప్రస్తుతం జంగాలపల్లి శ్రీనివాసులు చిత్తూరు శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. గొల్ల బాబూరావు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోకవర్గ ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జిగా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed