- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Yuvagalam Lokesh పాదయాత్రపై Vijaya Sai Reddy సెటైర్లు
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేత యువనేత లోకేష్ జనం గొంతుగా మారాలంటే తండ్రి చంద్రబాబు మద్దతు సరిపోదని, ప్రజల విశ్వాసం పొందాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో 44 నెలలుగా జనరంజక పాలన సాగుతుందన్నారు. వైసీపీ అసాధ్యమనుకున్న ఎన్నో ప్రజాహిత చర్యలను సుసాధ్యం చేస్తోందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలూ గరిష్ఠ సంతృప్త స్థాయిలో జీవనం సాగిస్తున్నారని అన్నారు. అయితే, 2019లో ప్రజలు తిరస్కరించిన తెలుగుదేశం నేడు దిక్కుతోచని స్థితికి చేరిందని విమర్శించారు. రాజకీయ చౌరస్తాలో నిలబడి గమ్యం కనబడని దిశగా అడుగులేస్తోందని ఎద్దేవా చేశారు. అందుకే, ఎలాగైనా ప్రజలకు వరసగా కొన్ని వారాలు కనపడడానికి లోకేష్ పాదయాత్రకు దిగుతున్నాని విమర్శించారు. అసలు సమస్యలే లేని రాష్ట్రంలో వాటి పరిష్కారానికి సారథి అవుతానని లోకేశ్ హామీ ఇచ్చాడా అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి: Nara lokesh అలా చేస్తే.. తిరుగులేని శక్తిగా టీడీపీ!