Chandra Babu Naidu.. ఈ జన్మలో మళ్లీ సీఎం కాలేవు...Vijaya Sai Reddy

by srinivas |   ( Updated:2022-11-17 15:03:47.0  )
Chandra Babu Naidu.. ఈ జన్మలో మళ్లీ సీఎం కాలేవు...Vijaya Sai Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలకు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి (VijaysaiReddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ జన్మకి మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేరని ఆయన వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి ఏం పీకారని ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 'మూడుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏమి పీకావ్ చంద్రం?, చివరి ఛాన్స్ ఇవ్వాలంటూ మళ్లీ కొత్త బిచ్చగాడిలా జనం మీద పడ్డావు. కుల పిచ్చితో రాష్ట్రాన్ని 3 దశాబ్దాలు సర్వనాశనం చేశావు. ఈ జన్మకి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేవు'అని విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా హెచ్చరించారు.

కాగా కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు ఇవే చివరి ఎన్నికలంటూ సంచలన ప్రకటన చేశారు. ప్రజలను ఉద్దేశించి భావోద్వేగంతో ప్రసంగించారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే అని.. లేకపోతే తనకు ఇవే చివరి ఎన్నికలని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తనను, తన భార్యను అవమానించారని.. ఇప్పుడున్న కౌరవసభను తాను అధికారంలోకి వస్తే గౌరవసభగా మారుస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని.. వీటన్నింటిని తుదముట్టించాలంటే టీడీపీ (Tdp) అధికారంలోకి రావాల్సిందేనని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

Bjp, Ycp Shock: చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన.. ఎమ్మిగనూరులో ఉద్రిక్తత

Next Story

Most Viewed