Breaking News: పోలీసులను క్షమాపణ కోరిన వైసీపీ ఎమ్మెల్యే

by Indraja |
Breaking News: పోలీసులను క్షమాపణ కోరిన వైసీపీ ఎమ్మెల్యే
X

దిశ వెబ్ డెస్క్: మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి అంటారు మన పెద్దలు. ముఖ్యంగా బాధ్యతాయుత పదవిలో ఉండే వాళ్ళు ఆచి తూచి మాట్లాడాలి లేకపోతే మొదటికే మోసమొస్తుంది, అందరి ముందు పరువు కోల్పోవాల్సి వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యే విషయం లోనూ ఇదే జరిగింది. వివరాలలోకి వెళ్తే.. పోలీసుల పట్ల వైసీపీ అధినేత అంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జంగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ MLA రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అధికార గర్వంతో వ్యవహరించిన తీరు ఆ పార్టీకి లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టింది.

అధికారం ఉందికదా అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పోలీసులను పరుష పదజాలంతో దుర్భాషలాడారు. అయితే బాధ్యతాయుత విధుల్లో ఉన్న పోలీసులపట్ల అంతే బాధ్యతాయుత పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఆలా భాద్యతారాహిత్యంగా విచాక్షణారహితంగా దూషించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అసలే ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఈ వ్యవహారంలో వైసీపీ అధిష్టానం కలుగచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇక చేసేదేమీలేక పోలీసులకు క్షమాపణ చెప్పారు MLA రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.

అసెలే ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్న ప్రతిపక్షాలకు.. వెతకబోయిన తీగ కాళ్ళకే తగిలినట్టు.. MLA రాచమల్లు అడ్డంగా దొరికిపోయారు. దీనితో విధుల్లో ఉన్న పోలీసులను దుర్భాషలాడిన MLA రాచమల్లు పై కేసు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు ఈ గొడవకి కారణం పరిమితికి మించి అక్రంగా మద్యం సీలాలను తీసుకు వెళ్తున్న వ్యక్తిని ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేందుకు సంతకం పెట్టాలని ఆ వ్యక్తిని కోరగా.. అందుకు ఆ వ్యక్తి నిరాకరించారు.

అంతలో అక్కడికి వచ్చిన రాచమల్లు ఎస్ఐ బేగ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్పీకి కాకుంటే వాళ్ళ వాళ్ల బాబుకి చెప్పుకో అంతే కానీ కేసు పెడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు.. చట్టాన్ని మార్చుకుంటావో లేకపోతే ప్రభుత్వాన్ని మార్చుకుంటావో నీ ఇష్టం అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అధిష్టానానికి తలనొప్పిని తెచ్చిపెట్టింది. చివరికి ఎమ్మెల్యే క్షమాపణలు కోరే స్థాయికి తీసుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed