YSRCP: ఉమ్మడి విశాఖపై భారీ వ్యూహం.. ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలతో రంగంలోకి జగన్

by srinivas |   ( Updated:2024-09-26 10:53:26.0  )
YSRCP:  ఉమ్మడి విశాఖపై భారీ వ్యూహం.. ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలతో రంగంలోకి జగన్
X

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి విశాఖ (Visakha District)పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (Ys Jagan) ఫోకస్ పెట్టారు. జిల్లాల విభజనలో భాగంగా విశాఖ మూడు జిల్లాలుగా విడిపోయింది. గత ఎన్నికల్లో అరకు (Araku), పాడేరు (Paderu) మినహా మిగిలిన ఏ స్థానంలోనే వైసీపీ అభ్యర్థులు (Ycp Candidates) గెలవలేకపోయారు అరకు ఎమ్మెల్యేగా ఆర్. మత్యలింగం (Mla R. Matyalingam), పాడేరు ఎమ్మెల్యేగా ఎం. విశ్వేశ్వరరాజు(Mla Visweswara Raju)తో పాటు ఎంపీ అరకు ఎంపీగా తనుజారాణి (MP Tanujarani) మాత్రమే గెలుపొందారు. ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి బొత్స ఏకగ్రీవం అయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చెప్పుకోదగ్గ నేతలు ఉన్నా పార్టీలో అసంతృప్తి నెలకొంది. విశాఖను రాజధానిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లినా పార్టీ బలహీనంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖ మేయర్ పీఠాన్ని సైతం ఆ పార్టీ పోగొట్టుకుంది.

దీంతో జగన్ మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో మాదిరిగా అత్యధిక సీట్లు గెలవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. తాజాగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. తాజా రాజకీయాలు, జిల్లా అధ్యక్షుల ఎంపికపై చర్చిస్తున్నారు. కీలక నేతలకు జిల్లాల పగ్గాలు అప్పగించాలనే ఉద్దేశంతో ఇప్పటికే పలువురు నేతల పేర్లు పరిశీలిస్తున్నారు. ప్రస్తుత భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు త్వరలో విశాఖ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులను వైఎస్ జగన్ ప్రకటించనున్నారు. ఎవరికి జిల్లాల పగ్గాలు అందజేస్తారో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed