తిరుపతిలో కేంద్రమంత్రి పర్యటన.. వైసీపీ కీలక డిమాండ్స్ ఇవే..!

by srinivas |
తిరుపతిలో కేంద్రమంత్రి పర్యటన.. వైసీపీ కీలక డిమాండ్స్ ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన బదులు సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టుగా మార్చాలని వైసీపీ ఎంపీ గురు మూర్తి డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కర్ తిరుపతి పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు డిమాండ్ చేశారు. మదనపల్లి అటు నాయుపేట ఉన్న వైవేను జాతీయ రహదారి మార్చాలన్నారు. సాగరమాల రోడ్డు నిర్మాణంలో అండర్ పాస్ నిర్మించాలని చెప్పారు. వివిధ దశల్లో నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. కాళహస్తి నుంచి తడ హైవేను జాతీయ హోదాగా మార్చాలని ప్రతిపాదనలు పంపిన విషయాన్ని గుర్తు చేశామన్నారు. రాష్ట్ర హైవేలను జాతీయ రోడ్డులుగా మార్చే అంశం ప్రధాని పరిధిలో ఉందని చెప్పారు. తిరుపతి బస్టాండ్‌లో ఈపీసీ, పీపీపీ మోడల్ పనులు పెండింగ్ ఉన్నాయని, త్వరగా తేల్చాలని నితిన్ గడ్కరీని అడిగినట్లు వైసీపీ ఎంపీ గుర్తు మూర్తి తెలిపారు.


అంతకుముందు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర మంత్రి బి.సి జనార్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్&బి కాంతి లాల్ దండే, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, చంద్రగిరి ఎంఎల్ఎ పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస రావు తదితరులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు విఐపీ లాంజ్‌లో ఏపీ జాతీయ రహదారులు, హై వే ప్రాజెక్టులపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షించి, మదనపల్లె‌కు హెలికాప్టర్‌లో బయల్దేరి వెళ్ళారు. అక్కడ పర్యనటన అనంతరం కేంద్ర మంత్రి ఈ రోజు రాత్రి తిరుమల చేరుకుని గురువారం ఉదయం ప్రాతః కాల సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి ఢిల్లీకి ప్రయాణం కానున్నారు.



Next Story