సైబర్ మోసం.. రూ. 34 లక్షలు పోగొట్టుకున్న బ్యాంకు ఉద్యోగి

by srinivas |
సైబర్ మోసం.. రూ. 34 లక్షలు పోగొట్టుకున్న బ్యాంకు ఉద్యోగి
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉద్యోగాలు, షేర్ మార్కెట్లలో లాభాలు అంటూ అమాయకులకు వల వేస్తున్నారు. దీంతో వీరి మాయ మాటలకు లొంగి లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో బ్యాంకు ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు ఎర వేశారు. షేర్ మార్కెట్‌లో లాభాలు వస్తాయంటూ సోషల్ మీడియా ద్వారా నమ్మించారు. సోషల్ మీడియా లింక్ ద్వారా బ్యాంకు ఉద్యోగి నుంచి రూ.34 లక్షలు కొట్టేశారు.. దీంతో బాధితుడు లబోదిబో మంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమాత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే లింకులను అసలు ఓపెన్ చేయొద్దని సూచించారు. సైబర్ నేరగాళ్ల సమాచారం తమకు అందిస్తే వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు.



Next Story