- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP:ఆ జిల్లాలో బయటపడిన ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆస్ట్రిచ్ గూడు!?
దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్ద జంతువులుగా చెప్పుకుంటున్న వాటిలో చాలా జంతువులు ఇండియాలోను మనుగడ సాగించాయి. పరిశోధకులు ఏం చెబుతున్నారంటే డైనోసార్స్ కూడా ఇండియాలో ఉండేవి అంట. ఇలా ప్రజెంట్ అంతరించి పోయిన జంతువులు కూడా భారత్‌లో మనుగడ సాగించాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆస్ట్రీచ్(నిప్పుకోడి) గూడు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో బయటపడింది. పలు దేశాలకు చెందిన పరిశోధకులతో కలిసి గుజరాత్‌లోని వడోదర యూనిర్శిటీ నిపుణులు చేపట్టిన తవ్వకాల్లో ఇది వెలుగుచూసింది. అందులో 911 గుడ్లకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయని వారు తెలిపారు.
భారత్ ఒకప్పుడు వైవిధ్యమైన ఎన్నో జీవజాతులకు ఆలవాలంగా ఉండేదని చెప్పేందుకు ఈ గూడు ఓ నిదర్శనమని వివరించారు. అయితే మెగాఫౌనా జంతువులు ఇవి 40 కిలోల కంటే ఎక్కువ బరువుంటాయి. ఇవి భారత్‌లో ఎందుకు అంతరించిపోయాయి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం పరిశోధకులు శోధన కొనసాగిస్తున్నారు. ఈ పరిశోధనకు ఇప్పుడు దొరికిన ఆస్ట్రిచ్ గూడు చాలా ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. సాధారణంగా ఆస్ట్రిచ్ గూడు 9 నుంచి 10 అడుగుల వెడల్పుగా ఉంటుంది. కానీ.. ప్రకాశం జిల్లాలో దొరికిన నిప్పుకోడి గూడు 1X1.5 మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ గూడులో 3,500 ఈ పక్షి గుడ్డు పెంకులు దొరికినట్లు సమాచారం.