కార్మికుల భద్రతకు ప్రాధాన్యం .. మంత్రి వాసంశెట్టి సుభాష్​

by Anil Sikha |
కార్మికుల భద్రతకు ప్రాధాన్యం .. మంత్రి వాసంశెట్టి సుభాష్​
X

దిశ, డైనమిక్​ బ్యూరో : కార్మికులు భద్రంగా ఉంటేనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మంగళవారం ఉదయం 54వ జాతీయ భద్రత వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. సుభాష్ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రై మంత్రి మాట్లాడుతూ రసాయన పరిశ్రమల్లో పనిచేసే కార్మికులందరికీ ప్రమాదాల పట్ల శిక్షణా తరగతులను నిర్వహించాలని సూచించారు. మీరు క్షేమంగా తిరిగి రావాలని మీ కుటుంబం మీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుందన్న విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలు గురించి సలహాలు ఇవ్వడానికి వసుధ మిశ్రా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ కమిటీ రిపోర్ట్ ఒక నెలలో కొలిక్కి వస్తుందనీ, వచ్చాక ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా అన్ని భద్రతా చర్యలను తూచా తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు కొండపల్లి ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రతినిధి రామచంద్రరావు, రామ్స్ ప్లాంట్ హెడ్ ఆశిష్ కుమార్, కెసిపి ప్లాంట్ హెడ్ మధుసూదన్ రావు, జాయింట్ చీఫ్ ఆఫ్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు, ఉషశ్రీ, డి సి ఐ పి శివకుమార్ రెడ్డి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం విజయవాడ బి ఆర్ టి ఎస్ రోడ్ లో విద్యార్థులు కార్మికులతో కలసి సమైక్యత నడక కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement
Next Story

Most Viewed