- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ నేతపై వైసీపీ దాడి పిరికిపంద చర్య: సోము వీర్రాజు
దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి రాజధాని ఉద్యమానికి మద్దతు తెలిపితే దాడులు చేస్తారా అని వైసీపీ నేతలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్లాన్ ప్రకారం భౌతికంగా దాడి చేసి కారును ధ్వంసం చేయడంపై మండిపడ్డారు. బద్వేలు ఉపఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ నేత సురేశ్‌పై కూడా విచక్షణంగా వైసీపీ గూండాలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ దాడి ప్రభుత్వం యొక్క పిరికిపంద చర్యలో భాగమేనని విమర్శించారు. విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా దాడి జరిగిందని ఆరోపించారు.
పోలీసుల సమక్షంలో తమ నేతలపై వైసీపీ దుండగులు దాడికి పాల్పడుతున్న స్పందించలేదని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటనపై ఆందోళనకు పిలుపునిచ్చామని తెలిపారు. ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలన్నారు. మరోవైపు బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ నందిగం సురేశ్ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాపై దాడి చేసి మా వాళ్ళే దాడి చేశారని చెప్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు బనాయించాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
దాడి చేసిన ఘటనపై కేంద్ర పార్టీకి నివేదిక పంపినట్లు తెలిపారు. ఇకపై ఇటువంటివి పునరావృతమైతే ప్రభుత్వం తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. మరోవైపు కర్నూలులో హైకోర్టు పెట్టాలన్న డిమాండ్‌కు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. హైకోర్టు కర్నూలులో పెట్టడానికి ప్రభుత్వం నాన్చివేత ధోరణి ఎందుకు అమలు చేస్తుందో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇక్కడే రాజధాని కడతా అని చెప్పి ఇప్పుడు మూడు రాజధానులు అని ఎందుకు అంటున్నారో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సూచించారు.
ఇవి కూడా చదవండి: వైసీపీ రౌడీ మూకలు పెట్రేగిపోతున్నాయి : అచ్చెన్నాయుడు