- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ లో చేరిన షర్మిల వైసీపీకి ముప్పుగా మారనుందా..? విశ్లేషకులు ఏమంటున్నారు?
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.ఎక్కడ కనివిని ఎరుగని రీతిలో ఒకే రాష్ట్రంలో రెండు వేరు వేరు పార్టీలకి సొంత అన్నాచెల్లెళ్లు అధ్యక్షత వహించడం ఇదే మొదటిసారి. వైస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ కుమార్తె షర్మిల ఒకరితో ఒకరు పోటీకి సై అంటున్నారు. నీ రక్తమే నా రక్తం తగ్గేదెలా అంటూ దూసుకెళ్తున్నారు. వైస్ జగన్ వైసీపీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా.. వైస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పగ్గాలను చేపట్టింది. గతంలో అన్న గెలుపు కోసం శ్రమించిన షర్మిల ఇప్పుడు అన్న పైన గెలుపు కోసం సన్నాహాలు చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ వైస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను పట్టించడం వెనుక మర్మమేంటి..? వైస్ షర్మిల జగన్ రాజీయా భవిష్యత్తుకి ముప్పుగా మారనుందా..? విశ్లేషకుల అభిప్రాయం ఏంటి..? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జగన్ వదిలిన బాణం వైస్ షర్మిల. అయితే కాంగ్రెస్ పార్టీ ఆ బాణం దిశను మార్చి జగన్ వైపు మళ్లించింది. అధికార ప్రభుత్వాన్ని కూలదోయడానికి వైస్ జగన్ పైకి అయన చెల్లెలు వైస్ షర్మిలనే అస్త్రంగా ప్రయోగిస్తోంది..ఇదే ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల మాట. అయితే కాంగ్రెస్ పార్టీ వైస్ షర్మిలకు అధ్యక్షురాలి హోదా కలిపించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది ఆమె వైస్ రాజశేఖర్ కుమార్తె.. కనుక ఆమె అధ్యక్షురాలిగా ఉంటె.. కాంగ్రెస్ పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వైస్ రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో అయినా ప్రజలు ఓట్లేస్తారు. ఇక అధికార పార్టీ అయిన వైసీపీకి ప్రజల్లో ఎలాగో వ్యతిరేకత ఉంది.
కనుక వైస్ షర్మిల ఉంటె జగన్ కి ఇచ్చినట్లే వైస్ కుమార్తె అయిన షర్మిలకు కూడా ప్రజలు ఓ అవకాశం ఇస్తారని కాంగ్రెస్ ఆశపడుతోంది. ఇక షర్మిల భర్త అనీల్ క్రైస్తవ బోధకుడుగా ఉన్నారు. కనుక ఆయన అభిమానులైన క్రైస్తవుల ఓట్లు కూడా అయన పై ఉన్న అభిమానంతో ఆయన సతీమణి షర్మిలకు వేసే అవకాశం ఉంది అని కాంగ్రెస్ ఆలోచన. ఇక జగన్ ప్రత్యేక పార్టీ పెట్టినప్పుడు జగన్ వెంట నడిచిన కాంగ్రెస్ నేతలు ఇప్పటికే జగన్ తీరు పై అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో షర్మిల ఏపీ కాగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉంటె కాంగ్రెస్ నుండి వైసీపీకి వెళ్లిన వైస్ రాజశేఖర్ రెడ్డి అభిమాన నేతలు తిరిగి సొంతగూటికి చేరుతారు.
దీనితో పార్టీకి మళ్ళీ పూర్వవైభవం చేకూరుతుంది అనే ఉద్దేశంతో షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం అధ్యక్షురాలి హోదా కల్పించింది. అయితే కాంగ్రెస్ తలచినట్లు రానున్న ఎన్నికల్లో గెలుస్తుందో లేదో పక్కన పెడితే.. షర్మిల రాక మాత్రం వైసీపీకి ముప్పే అంటున్నారు విశ్లేషకులు. షర్మిల కాంగ్రెస్ లో ఉంటె.. వైసీపీ సీట్లను, ఓట్లను కొల్లగొట్టడం ఖాయం అని.. షర్మిల జగన్ రాజకీయ భవిష్యత్తుకు గండంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.