- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:‘అసెంబ్లీకి జగన్ అందుకే రావట్లేదు’..సంచలన విషయాలు బయటపెట్టిన సీఎం చంద్రబాబు?
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండో రోజు (మంగళవారం) అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు గత వైసీపీ పాలన పై నిప్పులు చెరిగారు. అయితే మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు నల్ల కండువాలతో వైసీపీ శ్రేణులు అసెంబ్లీ గేటు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నేడు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఢిల్లీకి బయలుదేరారు. కాగా మూడు రోజులు అక్కడే ఉండనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..గడిచిన ఐదేళ్లలో జగన్ అసమర్థ పాలన చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. రాజకీయాల్లో జగన్ లాంటి వాళ్లు ఉండడానికి అర్హత లేదని వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రానికి వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని అసెంబ్లీలో మాట్లాడేందుకు జగన్ వద్ద సబ్జెక్ట్ లేకపోవడంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని చాలా మంది నేరాలకు పాల్పడ్డారని ఇక నుంచి అలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హత్యకు హత్య సమాధానం కాదని రాష్ట్ర ప్రజలు చట్టాలకు కట్టుబడి ఉండాలని తెలిపారు. డ్రగ్స్, గంజాయి వంటి వాటిపై ఉక్కుపాదం మొపుతామన్నారు.