- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏదీ పోరాట స్ఫూర్తి! కేంద్రాన్ని నిలదీయాలంటే భయమా?
ప్రజల ఆకాంక్షలను రాష్ట్రంలోని ప్రధాన పక్షాలు ఎప్పుడో వదిలేశాయి. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తెగేసి చెప్పినా నిరసన దీక్షల్లేవు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేమన్నా ఆందోళనల్లేవు. రైల్వే జోన్ ఇవ్వకున్నా స్పందన లేదు. చివరకు విశాఖ ఉక్కును తెగనమ్ముతామన్నా కిక్కురుమనలేదు. కడప ఉక్కు పరిశ్రమ ఇవ్వకున్నా.. రామాయపట్నం పోర్టు నిర్మించకున్నా.. ఆఖరికి విభజన హామీలు నెరవేర్చకున్నా మూడు ప్రధాన పార్టీలు పరస్పరం దూషించుకోవడం తప్ప కేంద్రాన్ని నిలదీసిన పాపాన పోలేదు. తాజాగా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మాత్రం వైసీపీ, టీడీపీ ఎంపీలు మళ్లీ వీటన్నింటి గురించి మాట్లాడారు. వీరు మాటలకే పరిమితమవుతారా? నిఖార్సుగా పోరాడేదేమైనా ఉందా అంటూ ప్రజలు శంకిస్తున్నారు.
దిశ, ఏపీ బ్యూరో:
ప్రత్యేక హోదా ఇవ్వనందుకు 2018లో వైసీపీ ఎంపీలు ఆరుగురు రాజీనామా చేశారు. ఏకంగా పార్లమెంటు ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నాటి అధికార టీడీపీ ఎంపీలను కూడా రాజీనామా చేయాలని డిమాండ్చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా అంటూ టీడీపీని డిఫెన్స్‌లో పడేశారు. 2019 ఎన్నికల సమయంలో మొత్తం 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామని నాటి ప్రతిపక్ష నేతజగన్ చెప్పుకొచ్చారు. అధికారానికి వచ్చాక కేంద్ర సర్కారు వద్ద ప్రతీ దానికీ సాగిలపడడం తప్ప ఏనాడూ గట్టిగా నిలదీసింది లేదు. కనీసం ప్రతిపక్షమైనా నిలేస్తుందనుకుంటే టీడీపీ కూడా మౌనం వహిస్తోంది. ఇక బీజేపీకి మిత్ర పక్షమైన జనసేన పార్టీ అసలు కేంద్రం జోలికే వెళ్లడం లేదు.
బీజేపీ ప్రాపకానికే ప్రయాస...
జనసేనాని పవన్ కల్యాణ్తాను కేంద్ర పెద్దలకు తొత్తును కాదని అప్పుడప్పుడూ చెబుతుంటారు. విశాఖ స్టీల్ప్లాంటు పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని చెబుతున్నా ఆచరణలో చేసిందేమీ లేదు. గడచిన మూడున్నరేళ్లుగా వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ పెద్దల ప్రాపకం కోసం పాకులాటడం తప్ప హక్కుల కోసం నిలదీసిన పాపాన పోలేదు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ధరలతో ప్రజల మూలిగలు పీలుస్తున్నా కనీసం నిరసన తెలపలేదు. పోర్టులు తెగనమ్ముతున్నా, విద్యుత్సంస్కరణల పేరిట ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నా ఒకరినొకరు దుర్భాషలాడుకోవడం తప్ప కేంద్రాన్ని ప్రశ్నించిన దాఖలాల్లేవు. అర్బన్ సంస్కరణలతో ప్రజలపై భారాలు మోపుతున్నా ఇదేంటని అడిగిన పాపాన పోలేదు. నిత్యావసరాలపై జీఎస్టీ పన్నులేంటని అడిగినోళ్లు లేరు. అసలు సగటు ప్రజల కష్టాలు, కన్నీళ్లకు కేంద్ర విధాన నిర్ణయాలే కారణమని తెలిసినా వీళ్లలో వీళ్లు అధికారం కోసం కొట్లాడుకోవడం తప్ప కేంద్ర సర్కారుపై పోరాడిందీ లేదు.
బీఆర్ఎస్ పోరుబాటపడితే మద్దతిస్తారా?
తాజాగా కేంద్రంలోని బీజేపీ అసంబద్ద నిర్ణయాలపై నికరంగా పోరాడతామని కేసీఆర్జాతీయ పార్టీ బీఆర్‌ఎస్ ముందుకొచ్చింది. పొరుగు రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా అవతరించడానికి కారణం బీజేపీ అవకాశవాద విధానాలే. ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టడానికి బీఆర్ఎస్ సిద్దమైంది. కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ బీఆర్‌ఎస్ పోరుబాట పడితే రాష్ట్రంలోని ప్రధాన పక్షాలు మద్దతిస్తాయా! లేక తోలు కత్తి, డాలుతో ఉత్తుత్తి యుద్ధం చేస్తూ మరోసారి ప్రజలను మభ్య పెడతాయా అనే చర్చ ప్రజల్లో జోరుగా సాగుతోంది. ఈపాటికే వైసీపీ సలహాదారుడు సజ్జల బీఆర్‌ఎస్‌తో పొత్తుకు సంబంధించి అవసరమైతే ఆలోచిస్తామని వ్యాఖ్యానించారు. ఇది కేవలం కేంద్రాన్ని హెచ్చరించడానికా లేక నిజంగానే పొత్తుకు సిద్ధమవుతారా అనేది బీఆర్ఎస్దూకుడును బట్టి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Also Read....
- Tags
- andhrapradesh