- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజాను ఓ రేంజ్‌లో ఏకిపారేసిన జబర్దస్త్ నటుడు..కారణం ఏంటంటే?
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఇక రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ సారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులపై మాటాలు తూటాల్లా పేలుతున్నాయి. ఇది ఇలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని తమ కుటుంబ సభ్యులు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. సినీ నటులు, జబర్దస్త్ నటులు సైతం పవన్ తరపున ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోజా పై జబర్దస్త్ ఆర్టిస్ట్ కిరాక్ ఆర్పీ ఫైరయ్యారు. తమను చిన్న ఆర్టిస్టులు అనడం సరికాదని..తాము చిన్న ఆర్టిస్టులైతే రోజా ఏమైనా నేషనల్ యాక్టరా? ఆస్కార్ ఆర్టిస్టా? అంటూ దుయ్యబట్టారు. ఏపీలో వైసీపీ ఓడిపోయే తొలి సీటు నగరి అని వ్యాఖ్యానించారు. జూన్ 4 నాడు అందరి లెక్కలు తేలుస్తామని చెప్పారు. ఈ క్రమంలో ప్రజల కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ అని , ఈ ఎన్నికల్లో పవన్‌ని భారీ మెజారిటితో గెలిపించాలని కోరారు.
Read More..
‘వాళ్లు పొలిటికల్ కమెడియన్స్’..వైసీపీ నేతలపై ఆది సెన్సేషనల్ కామెంట్స్!