- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Maha Shivaratri వేళ విషాదం.. గోదావరిలో ముగ్గురి మృతి
దిశ, డైనమిక్ బ్యూరో : ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పట్టిసీమలో విషాదం నెలకొంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానం చేసేందుకు నదిలోకి దిగిన ముగ్గురు యువకులు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా దోసపాడుకు చెందిన ఏడుగురు యువకులు పోలవరం మండలం పట్టిసీమ వద్ద శివరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు వెళ్లారు. అయితే బారికేడ్లకు దూరంగా ఉన్న ప్రాంతంలో పుణ్యస్నానాలు చేసేందుకు గోదావరి నదిలో దిగారు. కానీ యువకులు దిగిన ప్రాంతం లోతుగా ఉండటం, నదీ ప్రవాహం వేగంగా ఉండటంతో కొట్టుకుపోయారు. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, తోటి యాత్రికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గజ ఈతగాళ్ల సాయంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురుని కాపాడారు. ముగ్గురు కోసం గాలించారు.ఈ గాలింపుల్లో ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు ఓలేటి అరవింద్( 20), ఎస్.కె. లుక్మన్ (19), పెదిరెడ్డి రాంప్రసాద్ ( 18)లుగా పోలీసులు గుర్తించారు.