తక్షణమే ఎస్మా ఎత్తివేయండి: IFTU Demand

by srinivas |
తక్షణమే ఎస్మా ఎత్తివేయండి: IFTU Demand
X

దిశ, ఏలూరు: అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడంపై ఐఎఫ్‌టియు అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ దిగుమతి, ఎగుమతి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్మా ప్రయోగాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు మార్కెట్‌ యార్డ్‌ వద్ద వివి నగర్‌లో ఆదివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర కమిటీ కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, జీత భత్యాల పెంపుదల కోరుతూ అంగన్‌వాడీ‌లు పోరాడుతున్నారని, వారి హక్కులు హరించే విధంగా ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమని మండిపడ్డారు. కార్మిక సమస్యలను పాలకులు పరిష్కరించకపోతే ధర్నాలు, రాస్తారోకోలు, సమ్మె వంటి నిరసన కార్యక్రమాలను చేపట్టే హక్కు ఉందన్నారు. ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలేగానీ ఎస్మా వంటి చట్టాలను ప్రయోగించడమేంటని ప్రశ్నించారు.

Next Story

Most Viewed