- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఏపీ రోడ్లు నరకం.. తెలంగాణ ఎంపీ తీవ్ర విమర్శలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రోడ్ల పరిస్థితిపై తెలంగాణ నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కూడా ఏపీ రోడ్లపై విమర్శలు చేశారు. తాజాగా బీజేపీ ఎంపీ సోయం బాపురావు కూడా ఏపీలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఏపీ రోడ్లపై ప్రయాణం నరకమని సోయం బాపూరావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అభివృద్ధి విషయంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా చాలా వెనబడిందని మండిపడ్డారు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరిగిన వనజాతి సురక్ష మంచ్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేరిస్తే ప్రజా ప్రతినిధులను ఆయుధాలతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని బాపురావు డిమాండ్ చేశారు