Ap Politics: చంద్రబాబు అరెస్టుతో ఆ మూడు.. యమ స్పీడు

by srinivas |
Ap Politics: చంద్రబాబు అరెస్టుతో ఆ మూడు.. యమ స్పీడు
X

దిశ: ఉభయ గోదావరి ప్రతినిధి: చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. తమ అధినేతకు మద్దతుగా ఎవరికి నచ్చినట్లు వారు నిరసనలు తెలుపుతున్నారు. అయితే బాబు అరెస్టు అయ్యేదాకా పార్టీ పరిస్థితి ఒక రకంగా ఉంటే.. అరెస్టు అయిన నాటి నుంచి మైలేజీ మరో రకంగా మారింది. తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నుంచీ సానుభూతి పవనాలు వస్తున్నాయి. చంద్రబాబు అరెస్టును అక్రమమని చెబుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఈ వ్యవహారాన్ని ప్రజల్లోకి ఎంత బాగా తీసుకెళతారో వారో విజయవంతమైనట్లు లెక్క. ఈ విషయంలో మూడు నియోజకవర్గాల నాయకులు అధినేతపై తమ అభిమానాన్ని చాటుకుంటూ.. అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

గోదావరి జిల్లాలో పాలకొల్లు, గోపాలపురం, ముమ్మడివరం నియోజకవర్గాలకు చెందిన నేతలు ఇదే కోవకు వస్తారు. వీరు చంద్రబాబు అరెస్టు అయిన నాటి నుంచి పలు రకాల కార్యక్రమాలతో జనంలోకి చొచ్చుకొని పోతున్నారు. వార్కి అధికార పార్టీ కుయుక్తులను విపులంగా వివరించడంలో సక్సెస్ అవుతున్నారు. ముఖ్యంగా పాలకొల్లు శాసన సభ్యుడు నిమ్మల రామానాయుడు, గోపాలపురం ఇన్చార్జి మద్దిపాటి వెంకట్రాజు, ముమ్మడివరం ఇన్చార్జి దాట్ల సుబ్బారాజులు తమదైన శైలిలో జనంలోకి సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికంగా వినూత్న రీతిలో అనేక కార్యక్రమాలు చేసి ప్రజల్లో పార్టీ పట్ల, తమ నాయకత్వం పట్ల పాజిటివ్ దృక్ఫథం తీసుకొస్తున్నారు. దీంతో 2024 ఎన్నికల్లో వీరి గెలుపునకు ఢోకా లేదనే ప్రచారం సాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేయించిన సర్వేలోనూ టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు నివేదిక వచ్చినట్లు సమాచారం.

ఓ పక్క శాసన సభ.. మరో పక్క నియోజకవర్గం

చంద్రబాబు అరెస్టు నాటి నుంచి పాలకొల్లు శాసన సభ్యుడు నిమ్మల రామానాయుడు చాలా బిజీగా గడుపుతున్నారు. అప్పటి వరకు నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న నిమ్మల.. చంద్రబాబు అరెస్టుతో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మధ్యలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి అక్కడ తమ గళం విప్పారు. అనంతరం నియోజకవర్గం వచ్చి దీక్షలు, నిరసనలు వంటి వాటితో జనంలో బిజీ అయ్యారు. అధికార పార్టీ చంద్రబాబును ఏ విధంగా అక్రమ అరెస్టు చేయించిందీ అనే విషయం వివరించడంలో సక్సెస్ అయ్యారు.

గోపాలపురంలో వినూత్నం..

గోపాలపురం విషయానికొస్తే ఇక్కడి ఇన్చార్జి మద్దిపాటి వెంకట్రాజు నిత్యం వినూత్న కార్యక్రమాలతో జనంలోకి చొచ్చుకొని పోతున్నారు. ప్రజల నుంచి సానుభూతిని రప్పించుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేసి విజయవంతమయ్యారనే చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్ పాడి మోసే కార్యక్రమం చేసి జనం నుంచి మంచి స్పందన పొందారు. వెంకట్రాజు స్వతహాగా యువకుడు అవ్వడంతో సరికొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నారు.

ముమ్మడివరం.. జన రంజకం

ముమ్మిడివరంలో మాజీ శాసన సభ్యుడు దాట్ల సుబ్బారాజు నిత్యం కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. కులాలవారీగా దీక్షలు చేయించి సక్సెస్ అయ్యారు. మధ్యలో గ్రామా కు వెళ్లి జనాలకు వివరిస్తున్నారు. టెంటులో దీక్షలతోపాటు పలు వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో కేడర్ ఉత్సాహంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed