- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Eluru: వ్యక్తిని చంపేందుకు సుపారీ.. ఆరుగురి అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో సుపారీ హత్యలు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. తనకు ఇష్టంలేని, నచ్చని వ్యక్తులను గుట్టుచప్పుడు కాకుండా అంతమొందించేందుకు కొందరు ప్లాన్ చేస్తున్నారు. తమ చేతితో కాకుండా సుపారీ గ్యాంగ్‌తో దారుణానికి ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటన ఏలూరులో కూడా సంచలనం సృష్టించబోయింది. అయితే పోలీసులు అడ్డుకట్ట వేశారు. సుపారీ తీసుకుని హత్యలు చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తిని హత్య చేసేందుకు ఆరుగురు ముఠా సభ్యులు సుపారీ మాట్లాడుకున్నారు. వ్యక్తిని చంపేందుకు పక్కాగా స్కెచ్ వేశారు. అయితే పోలీసులు ఆ కుట్రను భంగం చేశారు. విశ్వసనీయ సమాచారంతో నిందితులను పట్టుకున్నారు. అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వారి నుంచి 4 కత్తులు, 2 వాహనాలు, 3 సెల్ ఫోన్లు, రూ.1.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎవరిని చంపేందుకు ప్లాన్ చేశారనే విషయాలు మాత్రం బయటకు పొక్కలేదు. దీంతో ఏలూరులో ఒక్కసారిగా కలకలం రేగింది.