- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chintamaneni: వైసీపీకి చుక్కలు చూపిస్తాం
దిశ, డైనమిక్ బ్యూరో: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి ఎంత నష్టం చేకూర్చాయో తెలియదు కానీ టీడీపీకి మాత్రం మాంచి బూస్ట్ ఇచ్చాయి. 2019 ఎన్నికల తర్వాత టీడీపీలో హేమాహేమీలంతా కేసుల కోసం భయపడో లేక దాడులకు భయపడో మొత్తం సైలెంట్ అయిపోయారు. ఎప్పుడైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపొందడంతో పుట్టలో ఉన్న నేతలంతా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్ అయిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సైతం కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
వైఎస్ జగన్‌పై స్వరం పెంచిన చింతమనేని
తాజాగా ఆ ఫైర్ బ్రాండ్ స్వరం పెంచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. ఉగాది పండుగ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలంటూ వ్యాఖ్యానించారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీపై వ్యతిరేకత స్పష్టమైందని.. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తైనప్పటికి వాటిని అర్హులకు, పేదలకు ఇవ్వకుండా సీఎం జగన్ ఓ సైకోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోసాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారని చెప్పుకొచ్చారు. సైకో పోవాలి..సైకిల్ రావాలని కోరుకుంటున్నారని..అందుకు నిదర్శనమే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి : టీడీపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎలా ఉందంటే..?