- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Adivasi Welfare Council: అసెంబ్లీ తీర్మానం రద్దు చేయాలి..
దిశ, బుట్టాయగూడెం: బోయవాల్మీకిలను ఎస్‌టీ జాబితాలోకి చేర్చుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల కమిటీ డిమాండ్ చేస్తూ సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు. అసెంబ్లీ తీర్మానం రద్దు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం చంద్రయ్యగూడెంలో నిరసన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్‌పీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంజా కృష్ణరాజు మాట్లాడుతూ ఓట్లు కోసమే గిరిజనేతరులని ఎస్‌టీ జాబితాలోకి చేరుస్తూ ఆదివాసీ చట్టాలనూ, హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. స్థానిక శాసనసభ్యుడు తెల్లం బాలరాజు తక్షణమే రాజీనామా చేసి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని డిమాండ్ చేశారు. బోయ వాల్మీకిలను ఎస్‌టీ హోదా అసెంబ్లీ తీర్మానాన్ని తక్షణమే రద్దు చేసేవరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఉద్యమంలో సంఘాలకు, పార్టీలకు అతీతంగా పాల్గొని భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సీఎం డౌన్ డౌన్ అంటూ ఎమ్మెల్యే బాలరాజు రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ జిల్లా నాయకులు తెల్లం శ్రీనివాసరావు, డివిజన్ కార్యదర్శి తెల్లం లక్ష్మణరావు, మండల ప్రధాన కార్యదర్శి కోవడయ్యా, ఆదివాసీ నాయకులు తెల్లంరాజు, మండల సహాయ కార్యదర్శి పుసం శ్రీను, గ్రామస్తులు పోడియం రాముడు, ఆదివాసీ మహిళ సంక్షేమ పరిషత్ మండల సభ్యులు రామలక్ష్మి, నాగమణి, పోడియం దుర్గ, గంగమ్మ, పోడియం దుర్గారావు, గ్రామస్తులు అధిక సంఖ్యలో ఆదివాసీలు పాల్గొన్నారు.