‘జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయాం’..ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు?

by Jakkula Mamatha |
‘జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయాం’..ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఎన్నికల సమయంలో గెలుపు పై ధీమాతో ఉన్న వైసీపీ ఊహించని విధంగా కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో వైసీపీ నేతల్లో అసహనం నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకోకపోవడం వల్లనే ఈ ఎన్నికల్లో ఓటర్లు మమ్మల్ని తిరస్కరించారని కరణం ధర్మశ్రీ ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో నా ఓటమికి బీఎన్ రహదారి గోతులే కారణం అని చెప్పారు. మేడివాడ దగ్గర రహదారులు గుంతలు ఏర్పడి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఆ రహదారులను బాగు చేయించాలని కోరుతున్నానని తెలిపారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్‌కు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని ఫైరయ్యారు. దీని ఫలితంగానే భారీ ఓట్ల తేడాతో దారుణంగా ఓడిపోయా అని కరణం ధర్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed